Take a fresh look at your lifestyle.

కోల్ టెండర్లపై విచారణకు మేం సిద్ధం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కోల్ టెండర్లపై విచారణకు మేం సిద్ధం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సింగరేణి లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ సింగరేణి విషయంలో రాష్ట్రాలపై కేంద్రానికి ఎలాంటి అజమాయిసీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర అని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం విషయంలో బీఆర్ఎస్ నేతలు పదే పదే సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తెలంగాణలోకి సీబీఐ రాకుండా నిషేధించిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. సింగరేణిపై ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నాయని అన్నారు. కొత్త నిబంధన పెట్టడం ముమ్మాటికీ తప్పేనన్న కేంద్రమంత్రి ఒక వేళ పెట్టినా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లు సింగరేణిలో దోపిడీ జరిగిందనీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ జరుగుతోందని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.