ఆదాయానికి మించిన ఆస్తులపై ఆరు చోట్ల దాడులు
ముద్ర, కోదాడ :
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిత దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో నీలా సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నీలా సత్యనారాయణకు చెందిన కోదాడ పట్టణంలోని ఓ రైస్ మిల్లులో, కళాశాలలో, బంధువుల ఇళ్లతోపాటు మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు, సీఎంఆర్ బియ్యం ఎగవేత, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి రుణాలు పొందటంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.