Take a fresh look at your lifestyle.

సింగరేణిలో కొత్త గనులు తీసుకురావాలి

  • కొత్త గనులపై దృష్టి పెట్టాలి.
  • లేకపోతే సింగరేణి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది.
  • సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి సమన్వయంతోనే కొత్త గనులు వస్తాయి.
  • చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కొత్త గనులు తీసుకురాకపోతే సింగరేణి సంస్థ మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఎమ్మెల్యే వివేక్ మీడియాతో మాట్లాడారు.బొగ్గు నిల్వలు లేవని బొగ్గు గనులు మూసివేస్తూ కొత్త గనులు తీసుకు రాకపోతే కార్మికుల శాతం తగ్గుతుందన్నారు. బొగ్గు గనుల వేలం పాటలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపిందని సీఎండీ తనతో అన్నారని ఎమ్మెల్యే చెప్పారు. సింగరేణి సంస్థకు కేటాయించిన గనులకు కేంద్ర ప్రభుత్వానికి 18 శాతం టాక్స్ సింగరేణి సంస్థ చెల్లిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.మందమర్రి మున్సిపాలిటీలో సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్స్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. కాలనీలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. కాలనీలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.ఈ క్రమంలో మందమర్రి అంగడిబజార్ ప్రాంతంలో శివ కేశవ ఆలయ కమాన్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడు బండి శంకర్నూ పరామర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మందమర్రి మండల వ్యాప్తంగా 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు

Leave A Reply

Your email address will not be published.