Take a fresh look at your lifestyle.

నేత్ర నేత్రపర్వంగా జాతర మహోత్సవాలు

  • పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

కోరుట్ల/కథలపూర్, ముద్ర: జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం లోని తుర్తి గ్రామంలో హనుమాన్ జాతర, పెగ్గర్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, జాతర సిరికొండ గ్రామంలో ఆదివారం రోజు జింక మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సిరికొండ గ్రామం లో జింక మల్లన్న జాతర మహోత్సవాలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆచారవంతులు, యాదవ. సంఘ సహకారంతో నిర్వహించిన ఈ జాతర మహోత్సవం ఆద్యంతం భక్తి భావాన్ని పెంపొంధించాయి. ఈ సందర్భంగా కేతమ్మ, మల్లన్న ల కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. అనంతరం భక్తులకు మహా ఆన్నప్రసాదం అందజేశారు. మహిళలు మల్లన్న స్వామివారికి భక్తిశ్రద్దలతో బోనాలు సమర్పించారు. ఒగ్గు కళాకారుల డోలు విన్యాసాలు, ఆకట్టుకున్నాయి. జాతరకు మండలంలోని పలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవంతో గ్రామం లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, పులి హరి ప్రసాద్ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.