Take a fresh look at your lifestyle.

శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ పట్టణంలోని గోవింద క్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సాయంకాలం సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ ఆచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ వేడుకలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అన్నప్రసాద దాతలుగా గజ్జ రమేష్ గౌడ్, పోతుల రామకృష్ణ వ్యవహరించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.