ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తాడూర్ మండలంలోని మేడిపూర్ గ్రామంలో రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వ్యవసాయానికి అవసరమైన పలు ఉపకరణాలను పంపిణీ చేశారు. కూరగాయల పెంపకానికి ఉపయోగపడే ప్లాస్టిక్ ట్రేలు, సేంద్రియ ఎరువుల తయారీకి వర్మీ కంపోస్ట్ బెడ్లు, అదనపు ఆదాయ వనరుగా తేనెటీగల పెంపకానికి బాక్సులను రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ రామచంద్ర రెడ్డి, తాడూర్ సర్పంచ్ మల్లయ్య, మేడిపూర్ సర్పంచ్ మల్లయ్య, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.