Take a fresh look at your lifestyle.

ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

స్వగ్రామమైన యనమన్బెట్ల నుంచి నాగర్‌కర్నూలుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి బయలుదేరిన పవన్ కుమార్, కల్వకోలు – చెన్నపురంపల్లి మధ్య ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన హైదరాబాద్‌కు చెందిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే పవన్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. పవన్ కుమార్ మృతిపై సహచర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.