ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈ నెల 4న జరగనున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీపీవో జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.