Take a fresh look at your lifestyle.

కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని తెలంగాణ భవన్ నిర్మాణం వర్కర్స్ యూనియన్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. బుధవారం
సీఐటీయూ ఆధ్వర్యంలో భువనగిరిలోని జగదేవ్పూర్ చౌరస్తా వద్ద భవన నిర్మాణ కార్మికులతో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్టుబడు దారులకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నుంచి రద్దుచేసి నూతన చట్టాలు అమలులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, పట్టణ కార్యదర్శి గంధ మల్ల మాతయ్య, నాయకులు బాలయ్య, ఎల్లయ్య, యుగేందర్, అమరేందర్, రాములు, లక్ష్మి, కవిత, అండాలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.