కోరుట్ల, ముద్ర విలేకరి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనీ హరిద్వార్ లో 24, 25 తేదీల్లో జరిగిన 42 వ జూనియర్, 39 వ సబ్ జూనియర్ క్యూర్గి జాతీయస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ లో కోరుట్ల పట్టణానికి చెందిన కొండ్ర ధన్విన్, మెట్పల్లి పట్టణానికి చెందిన ఆకోజి దేవాంశ్, బెజ్జారాపు సాన్విత్ లు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, సబ్ జూనియర్ విభాగంలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ను జాతీయస్థాయిలో సాధించారని, నేషనల్ కోచ్, మాస్టర్ తైక్వాండో క్లబ్ వ్యవస్థాపకులు నావనంది రమేష్ తెలిపారు. ప్లేయర్స్ ని తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు ముఠా శ్రీనివాస్, జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ కోల గంగారావు, సభ్యులు అభినందించారు.కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎస్. సంతోష్, వైస్ ప్రెసిడెంట్ పి రాజేందర్, సతీష్, రాహుల్, దీక్షిత అమిత్య, జశ్వంత్ లు పాల్గొన్నారు.