బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని వేదం పాఠశాలో చదువుతున్న కౌట.(బి) గ్రామానికి చెందిన వెండి శివసాయి, నాగభూషణం పాఠశాలలో చదువుతున్న బోథ్ మండల కేంద్రానికి చెందిన పట్ల అకిరానందన్ లు ఇటీవల ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్, కిషోర్ కుమార్ లు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు సన్మానించి అభినందనలు తెలిపారు.
