Take a fresh look at your lifestyle.

జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని,
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేశ్ కు వినతి పత్రం అందజేశారు.
సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు అడివయ్య మాట్లాడుతూ..
మెదక్ జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మల్లేశం, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గౌరయ్య , అజయ్, పార్టీ సభ్యులు దుర్గ యాదగిరి వెంకట్ నరేందర్ నహీం ప్రవీణ్ ప్రశాంత్, లచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వేతనాలను వెంటనే చెల్లించాలి
ఆశ ,అంగన్వాడిలకు ఏప్రిల్ నెల వేతనాలను వెంటనే చెల్లించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను అమలు చేయాలని, సమస్యలను
ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కు సిఐటీయు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.