ముద్ర ప్రతినిధి మెదక్:
జిల్లాలో 19206 రైతుల నుండి
90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు
అకౌంట్లో జమ చేశామన్నారు.
మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుందన్నారు.
జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రవాణా సంబంధిత విషయాలలో ప్రణాళిక బద్దంగా వ్యవహరించి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నట్లు వివరించారు.