ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలిని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించిన తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి పలు కీలక సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, రివిజన్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారూ.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి ఖచ్చితమైన వివరాలు సేకరించి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.తప్పులు లేకుండా చూసుకోవాలని, తప్పులు ఉన్నవాటిని సరిచేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, డిఆర్ఓ నాగరాజమ్మ, ఇతర ఎలక్షన్ అధికారులు పాల్గొన్నారు.