రైతులు పంట మార్పు చేయండి… సిద్దిపేట ప్రజలు ఎమ్మెల్యే మార్పు చేయండి….నర్మేట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
* 2029 లో సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కు మంత్రి పదవి
* యువతకు ATC సెంటర్ లలో ఉపాధితో కూడిన విద్య
* పంట మార్పుతో అధిక లాభాలు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు గదించాలని… అలాగే సిద్దిపేట ప్రజలు 2029 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే రాష్ట్రం లో మంత్రిని చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మేట గ్రామంలో 300 కోట్లతో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన మాట్లాడారు. రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా ఈ కార్యక్రమంలో విడుదల చేస్తున్నాం అన్నారు. మొత్తం 70 లక్షల మంది రైతులకు మొదటి విడుతగ 3600 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. రాబోయే 40.రోజుల్లో మిగతా నిధులు 9 వేల కోట్ల్య్ కూడా పూర్తిగా విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఆర్థిక సమస్యలు అధిగామిస్తూ ముందుకు సాగుతున్నాం అన్నారు. రైతు పక్ష పాత ప్రభుత్వం గా రైతులు పండించిన పంటకు నిజమైన MSP ఇవ్వడమే కాకుండా 500బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. రైతు పండించిన చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రైతుల వద్ద నుండి 70 లక్షల మీట్రిక్ టన్నుల పంటను కొనుగోలు చేశామని తెలిపారు. ప్రజలకు అందించి తర్వాత ప్రభుత్వం వద్ద 26 లక్షల మెట్రిక్ తన్నుల ధాన్యం ఇంకా మిగిలే ఉందన్నారు. రైతులు పంట మార్పిడి చేయాలనీ సూచించారు.

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కి నిధులు కేటాయించి పూర్తి చేశాం…
నర్మేట్ట లో ఏర్పాటు చేసిన ఆయిల పామ్ ఫ్యాక్టరీ కి 300 కోట్ల నిధులు కేటాయించి ఫ్యాక్టరీ నులు పూర్తి చేశామన్నారు. రైతులకు అద్భుతమైన లాభాలు అందివ్వడానికి ఫ్యాక్టరీ సిద్ధం అయిందని రైతులు పంట మార్పు చేసి ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు.
కొడంగల్ లో ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టండి తుమ్మల……
కొడంగల్ లో కూడా ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వర్ రావుకు సూచించారు. అక్కడి రైతులకు కూడా లాభం చేకూరేలా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే తన లక్ష్యం……..
తెలంగాణ మహిళల సొంత తమ్ముడ్ని
తాను మహిళలు సొంత తమ్ముడిని అని. అందుకే అన్ని సంక్షేమ పథకాలు మహిళ పేరు పైనే తెస్తున్నాన్నారు. తెలంగాణ లో ఇప్పటివరకు 67 లక్షల మహిళా స్వయం సహాయం బృందాలు ఏర్పాటు చేశారని దాన్ని కోటికి పెంచలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులం చేయడమే తన లక్ష్యం అన్నారు. అలాగే యువతకు ప్రతీ జిల్లాలో ATC సెంటర్లు ఏర్పాటు చేశామని వారికి ఇష్టం అయినా సంఘాల్లో స్కిల్స్ డెవోలోప్ చేసి ఉద్యోగాలు కల్పించడం తన బాధ్యత అన్నారు.

2029 లో సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించండి… మంత్రి పదవి ఇప్పిస్తా…..
2029 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్ని రోజులు ఒకే కుటుంబానికి అవకాశం ఇస్తారని మార్పు చేస్తే అభివృద్ధి ఖాయం అన్నారు. తాను ప్రజల పక్ష పాతినని చెప్పుకోచ్చారు. కొడంగల్ కు నిధులు తీసుకెళ్లి వాడిని అయితే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తానని ప్రశ్నించారూ. తాను ఎమ్మెల్యే కోసం పని చేయనని ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. సిద్దిపేట ఇంచార్జి మంత్రి వివేక్ సిద్దిపేట సమస్యలు తన దృష్టికి తెస్తే సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు