ఫోక్సో కేసు నమోదైన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయట్లేదు-విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి
బడే బాయ్ చోటే బాయ్ మధ్య ఏమి ఒప్పందం ఉంది
ముద్ర, నారాయణపేట:
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై ఫోక్సో కేసు నమోదైన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని… బడే బాయ్ చోటే బాయ్ ( ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి) మధ్య ఏమి ఒప్పందం జరిగిందని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. నారాయణ పేట మండలానికి చెందిన సామాన్య బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 5 మంది ఐపీఎస్ అధికారులచే సిట్ వేశారని… మైనర్ బాలికపై అత్యాచార ఘటన జరిగిందని బాధితురాలు ఫిర్యాదు చేస్తే కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళితే అర్ధరాత్రి వరకు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో యువతను చైతన్యం చేసి ఆందోళనలు చేపడతామన్నారు. విలేకరుల సమావేశంలో కే సుదర్శన్ రెడ్డి, విజయ సాగర్, బుల్లెట్ రాజు, కౌన్సిలర్ భరత్ , బోయ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.