Take a fresh look at your lifestyle.

ధాన్యం నిల్వ కోసం స్థలాన్ని సమకూర్చుకోవాలి-కలెక్టర్ భవేశ్ మిశ్రా

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

జిల్లాలో ధాన్యం నిల్వ కోసం మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే గోదాములకు తరలించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం సమకూర్చు కోవాలన్నారు. ఇతర జిల్లాల్లో గోదాములు అందుబాటులో ఉంటే, ఆ ప్రదేశాలు గుర్తించి ధాన్యం అక్కడికి తరలించాలన్నారు. ధాన్యం నిరంతరాయంగా తరలింపునకు అనుగుణంగా తగినన్ని లారీలు, తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డిఎం మార్క్ ఫెడ్ మహేష్, డిఆర్డిఓ విజయలక్ష్మి, జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.