ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఈఓ దర్శనం భోజన్న ను ఘనంగా సన్మానించారు. గత విద్యా సంవత్సరంలో జరిగిన10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సంఘ ప్రతినిధులు ఎంసీ లింగన్న , జనార్ధన్, రమేష్ , జనార్ధన్, బాలకిషన్, పి విలాస్, ఎం రాజేశ్వర్, రాములు, పోతన్న, జి రమేష్, శేషాద్రి, వేణుగోపాల్ తదితరులున్నారు