Take a fresh look at your lifestyle.

ప్రజావాణికి 57 ఫిర్యాదులు

  • దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి
  • అధికారులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: సోమవారం కొంగకలాన్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు అందాయి.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి,నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కాగా, ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖవి 34, ఇతర శాఖల నుండి 23 మొత్తం 57 దరఖస్తులు అందాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్,జిల్లా రెవెన్యూ అధికారి సంగీత,వివిధ శాఖల జిల్లా అధికారులు,మున్సిపల్ అధికారులు,మండల తహశీల్దారులు,కలెక్టరేట్ సూపరింటెండెంట్లు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.