Take a fresh look at your lifestyle.

ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత

 

ఎమ్మెల్యే  అధికారులను బెదిరించారంటున్న బిఆర్ఎస్ బిజెపి

ఎన్నిక ప్రక్రియ రేపటికి వాయిదా

 ముద్ర ప్రతినిధి, నిర్మల్:

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ శనివారం జరగాల్సి ఉండగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య వాయిదా పడింది. ఈ క్రమంలో ఎంఎల్ఏ వెడ్మా బొజ్జు అధికారులను బెదిరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బి ఆర్ ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ధ్వజమెత్తారు. వివరాలిలా ఉన్నాయి.

గతంలో వాయిదా పడ్డ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో శనివారం ఎన్నిక నిర్వహించారు. గతంలో రెండుసార్లు వాయిదా సందర్భంలో టిఆర్ఎస్ బిజెపిలకు చెందిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయలేదు.  శనివారం జరిగిన సమావేశంలో బిజెపి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు 8 మంది ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. అధికారులు ఎన్నిక నిర్వహణలో సరైన విధానం అమలు చేయని కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.  నిబంధనల ప్రకారం అక్షర క్రమంలో అంకం మౌనిక నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బిఆర్ఎస్ కు చెందిన ముగ్గురు, బిజెపికి చెందిన నలుగురు సభ్యులు చేతులెత్తారు. దీంతో ఎన్నిక అయిపోయిందంటూ బయట ప్రచారం మొదలైంది. అయితే ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మాత్రం అధికారులు స్పష్టమైన నిబంధనలు తెలపకుండా ఎన్నిక నిర్వహించారని, ఈ ఎన్నిక వాయిదా వేయాలని అధికారులను కోరారు. దీంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నిక వాయిదా విషయం తెలియడంతో బీజేపీ, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున మోహరించి మున్సిపల్ కార్యాలయాన్ని మేము ముట్టడించారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. పోలీసు జులం నశించాలంటూ అధికారుల తీరును విమర్శించారు. ఎన్నిక పూర్తయిందని, బీజేపీ అభ్యర్థిని చైర్మన్ గా  ప్రకటించాలని బిఆర్ఎస్ అసెంబ్లీ ఇన్చార్జి జాన్సన్ నాయక్, బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ధర్నా నిర్వహించారు. ఈ ఎన్నిక ప్రత్యేక ప్రజాస్వామ్య విరుద్ధమని, ఎమ్మెల్యే తీరు ఆక్షేపణీయంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసాహించకుండా అధికారం ఉందన్న అహంతో సభ్యుల కోరం లేకుండా బెదిరించి అధికారులను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికను వాయిదా వేశారని ఆరోపించారు. ఈ దశలో బిజెపి కౌన్సిలర్ సత్యవతి కళ్ళు తిరిగి పడిపోగా 108 లో వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భారీ బందోబస్తు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్మల్ ఏఎస్పి సాయికిరణ్ తో పాటు అదనపు ఎస్పి ఉపేంద్ర రెడ్డి, స్థానిక సిఐ అజయ్ కుమార్ ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. ఐతే ఎన్నిక వాయిదా విషయం తెలియగానే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని సరిదిద్దేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.