Take a fresh look at your lifestyle.

కుప్పకూలిన విమానం.. అజిత్ పవార్ కన్నుమూత!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ బారామతి విమాన ప్రమాదంలో కన్నుమూసినట్లు పీటీఐ వెల్లడించింది. బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతి సభ కోసం వెళ్తున్న ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన సంఘటనలో ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా చనిపోయారు.

తీవ్రంగా గాయపడిన అజిత్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. రన్‌వేపై అదుపు తప్పి మంటలు అంటుకున్న విమానం నుంచి రికవరీ కార్యకలాపాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సంతాప ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. పూర్తి విచారణకు సివిల్ ఏవియేషన్ అధికారులు సిద్ధం. ఎన్సీపీ కార్యకర్తలు షాక్‌లో మునిగారు.

Leave A Reply

Your email address will not be published.