- అక్రమంగా నిలువ ఉంచిన 24 క్వింటాళ్ల బియ్యం సీజ్
ముద్ర ప్రతినిధి మహబూబ్నగర్: ప్రభుత్వ ప్రజా పంపిణీ చౌకధర దుకాణంలో రేషన్ బియ్యం తో పాటు ఇతర నిత్యావసర సరుకులు అమ్ముతూ ఓ రేషన్ షాప్ డీలర్ దొరికారు. వివరాల్లోకి వెళ్తే జడ్చర్ల మండలం నసర్లబాదు గ్రామానికి చెందిన షాప్ నెంబర్ 37 డీలర్ రికార్డుల ప్రకారం 6 క్వింటాళ్ల బియ్యం ఉండాల్సింది, కాగా 24 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నట్లు గమనించిన గ్రామస్తులు పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు.బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 37 నెంబర్ షాపులో రికార్డుల ప్రకారం ఉండాల్సిన దానికంటే అదనంగా 24 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించామని వాటిని సీజ్ చేసి షాప్ కు తాళం వేయడం జరిగిందని తెలిపారు.ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇతర సరుకులు అమ్మడం కాక,అదనంగా ఉన్న 24 గంటల బియ్యం కు సంబంధించి కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.అయితే రేషన్ షాపులో బియ్యం తీసుకొనాలంటే తన దగ్గర నిత్యవసర సరుకులు ఉప్పు, పప్పు, నూనె మొదలగు సరుకులు కొనాల్సిందేనని సంబంధిత డీలర్ ప్రజలపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.