- జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ.
- డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి.
కోరుట్ల/ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపి సేవలు, ఐపీ సేవలు, రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్, మెడికల్ ఫార్మసి, ఫీవర్ రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని ఆదేశించారు. రోగులకు డైట్ ఫుడ్, పాలు, బ్రెడ్ ఫ్రూట్స్ పోషక ఆహార పదార్థాలు అందించాలని, వర్షాకాలం సీజనల్ వ్యాధులు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో ఆవరణంలో పేషంట్ల గదులలో శుభ్రంగా ఉండేలా పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మండల్ తహసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఇబ్రహీంపట్నం మండలం ఎరువుల సరఫరాను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం పాక్స్ నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలుకు సంబందించిన రికార్డులను పరిశీలించారు. యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాల యూరియా ఇస్తున్నారని, వారి భూమి వివరములు తనిఖీ చేశారు. పంటకు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయాలని, ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే సొసైటీ సిబ్బంది పై వ్యవసాయ శాఖ సిబ్బంది పై కఠిన చర్యలు తప్పవని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, ఇబ్రహీంపట్నం మండల్ తహసీల్దార్ వరప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.