- మద్దిమడుగు నుండి ఆంధ్రాకు వంతెన వేయడానికి సహకారం.
- శ్రీశైలం పాలకమండలిలో అచ్చంపేట నియోజకవర్గం ప్రజలకు చోటు ఇవ్వాలని వినతి.
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శ్రీశైలం జలాశయం గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నల్లమల్ల ప్రాంతంలోని పదర మండలం మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవస్థానం సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణమ్మ పై బ్రిడ్జి నిర్మాణం చేసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు దూరపారం భారీగా తగ్గడంతో పాటు రెండురాష్ట్ర సంబంధాలు మరింత మెరుగుపడుతూ పలు రకాల వ్యాపారాలు, పర్యాటక రంగం, రవాణా వ్యవస్థ తో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందని రెండు రాష్ట్రాలకు కూడా సత్సంబంధాలు బాగా మెరుగుపడతాయని అలాగే శ్రీశైల దేవస్థానంలో అచ్చంపేట పాలకమండలి లో స్థానము కల్పించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం ఇచ్చి వివరించారు. గత ఏడాది కూడా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసే సందర్భంగా కూడా పై విషయంపై ఏపీ సీఎంకు అచ్చంపేట ఎమ్మెల్యే వినతిపత్రం ఇచ్చినప్పటికీ రెండు రాష్ట్రాల సీఎంల సమన్వయంతో జరగాల్సిన వ్యవహారం సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో గత రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన వంతు ప్రయత్నాలు నిరంతరాయంగా పలు సందర్భాల్లో నల్లమల ప్రాంతా అభివృద్ధి కొరకై కృషి చేస్తున్నట్లు వంశీకృష్ణ తెలిపారు.
