- బుద్ధునితో నా ప్రయాణం గోడ పత్రిక ఆవిష్కరణ.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: బౌద్ధం ఒక జీవన మార్గం అని దేశంలో కులం చేత అంటరానితనాన్ని అసమానతని అస్పృశ్యతను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క జాతులు బౌద్ధాన్ని స్వీకరించి సమానత్వం వైపు అడుగులు వేయాలని సమత సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి నరేష్ మాల మహానాడు జేఏసీ జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం కోరారు. ఈనెల 30న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో బుద్ధునితో నా ప్రయాణం నాటికకు సంబంధించిన గోడపత్రికను సోమవారం రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం తీసుకోవడానికి సుదీర్ఘంగా 20 సంవత్సరాలు బౌద్ధం మీద అధ్యయనం చేసి బౌద్ధాన్ని స్వీకరించడం జరిగిందన్నారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని సాధించడం కోసం మనమందరం బోధ మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కో కన్వీనర్ కట్ల మురళి, బిఎస్ఐ నాయకులు గంపల అంతయ్య టీం నాయకులు బోల్లెద్దు దశరథ, నామ నాగయ్య, కన్నె శివయ్య, ఎడ్ల గోపి, నామా వేణు గండమల్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు