ముద్ర కూకట్‌పల్లి :
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముసాపేటలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చున్ను పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి రమేష్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోసిన్, జాకీర్, తూము వేణు, తూము సంతోష్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సప్పిడి భాస్కర్, పెంటయ్య, తూము వినయ్, కర్రెమ్మ, నారాయణ, సచిన్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.