Take a fresh look at your lifestyle.

మణికొండలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం

 

ముద్ర మల్కాజిగిరి

మణికొండలోని ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్‌లో ఆదివారం నవసేవా సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో, టి ఎక్స్ హాస్పిటల్స్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మణికొండ మున్సిపల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ ప్రారంభించారు.
శిబిరంలో దంత వైద్య నిపుణుడు డాక్టర్ కొండపల్లి చైతన్య నేతృత్వంలో బీపీ, షుగర్, ఈసీజీ పాటు నేత్ర, దంత, చర్మ, జుట్టుకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. యువత ప్రాణదాతలమనే భావనతో రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎంప్లాయిస్ కాలనీ, హుడా కాలనీ, చైతన్య కాలనీ ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. కార్యక్రమంలో నవసేవా సంకల్ప ట్రస్ట్ చైర్మన్ మణి, ప్రధాన కార్యదర్శి మహేష్, అధ్యక్షుడు మొహమ్మద్ అజార్, సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు, ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచార్యులు, మాజీ అధ్యక్షుడు పెంటా రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.