Take a fresh look at your lifestyle.

ఆశా వర్కర్స్ కు రు 18000/- వేతనం చెల్లించాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని,
రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి మాట్లాడుతూ ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదన్నారు . ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని . ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్నారు . అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో పొందుపరిచినదని . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదన్నారు . 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. కావున పై సమస్యలు పరిశీలించి, ఈ క్రింది డిమాండ్స్ను పరిష్కరించాలన్నారు.
ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షలు బాలమనణి, సహాయ కార్యదర్శి బిట్ల శ్రీలత, శోభ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.