Take a fresh look at your lifestyle.

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ వాసి విజయం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓరుగంటి క్రాంతి కుమార్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యునిగా ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందడం విశేషం.

ఈ సందర్భంగా క్రాంతి కుమార్ విజయంపై నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆయనను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వకారణమని స్థానికులు కొనియాడారు.

క్రాంతి కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.