సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్
హైదరాబాద్ మీర్ పేట లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరేశారు.
అనంతరం దేశాల భూపాల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలను కల్పించిందని పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే నేడు మనం ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందుతున్నామని అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ, దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడుతూ .. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ప్రతిఫలమే ప్రపంచంలో గర్వించదగ్గ స్థాయికి భారతదేశం చేరిందని .. దేశ గౌరవం, స్వేచ్ఛకు, సమానత్వానికి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.దేశం అన్ని రంగాల్లో వేగంగా పురోగతి సాధిస్తోందని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. గణతంత్ర దినోత్సవం మనకు కర్తవ్యబోధను గుర్తు చేసే పర్వదినమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ ఉపాధ్యక్షులు గోపీనాథన్ కట్టెకోల, రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షులు పి.రాజు గౌడ్, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి చైతన్య, కమ్మరి రమేష్,అరుణ్ సింగ్, సురేందర్, మహేష్ , దుష్యంత్ బల్బీర్ సింగ్, కడమంచి రాజశేఖర్, రమేష్, ధనరాజ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.