28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్. మీనాక్షి నటరాజన్ ల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరు ను తొలగించిన అంశంలో ఏఐసీసీ పిలుపు మేరకు పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గ్రామ సభలు పెట్టి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడనున్నారు. నియోజక వర్గాలలో ఒక గ్రామ సభ లో పాల్గొననున్నారు. ఉదయం ఒక గ్రామంలో సాయంత్రం ఒక గ్రామంలో సభ నిర్వహిస్తారు. జాతీయ ఉపాధి చట్టం జాబ్ కార్డ్ హోల్డర్లతో సమావేశం సహా పంక్తి భోజనం చేయనున్నారు. 28న మెదక్, మానకొండురు, 29న వేముల వాడ, ఎల్లారెడ్డి, 30న మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనం సాయంత్రం ఆలేరు నియోజక వర్గంలో గ్రామ సభ, 31న నకిరేకల్, ఇబ్రహీం పట్నం నియోజక వర్గాలలో గ్రామ సభలు ఉంటాయి.