Take a fresh look at your lifestyle.

ఆర్ఓబి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు

  • ఆర్కేపీ కాంగ్రెస్ నాయకులు

రామకృష్ణాపూర్, ముద్ర : చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి క్యాతన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులపై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ప్రత్యేక దృష్టి పెట్టారని పట్టణ కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు.నిత్యం అర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడుతూ పనుల పురుగోతిపై ఆరా తీశారు.బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఆదివారం ఆర్ఓబి బ్రిడ్జి పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ,చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు మాట్లాడుతూ అప్పట్లో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో పనులకు శంకుస్థాపన చేసి,పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి బ్రిడ్జి ప్రారంభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బ్రిడ్జి పనులు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమై ఓటమిపాలయ్యారని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.