Take a fresh look at your lifestyle.

శ్రీరామనవమి సందర్భంగా పల్లకి సేవ

ఖమ్మం, ముద్ర : శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని బురాన్ పురం భక్తాంజనేయ స్వామి దేవాలయం ఆదివారం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తనయుడు, కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగేందర్ హాజరయ్యారు. సాయంత్రం ఉత్సవ మూర్తులతో స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరై పల్లకి సేవలో పాల్గొన్నారు. భక్తి పాటలు, కోలాటాల నడుమ ఊరేగింపు ఉత్సాహంగా సాగింది.దేవాలయం చైర్మన్, కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి.

Leave A Reply

Your email address will not be published.