Take a fresh look at your lifestyle.

బి ఆర్ ఆర్ కళాశాల లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

ముద్ర, ప్రతినిధి జడ్చర్ల: స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో NSS యూనిట్ 3 ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా NSS యూనిట్ 3 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. సదాశివయ్య మాట్లాడుతూ,మరాఠా యోధుడు, మరాఠా జాతి నిర్మాత, చెల్లాచెదురుగా ఉన్న మరాఠా ప్రజలను సమైక్యం చేసి, మొఘలులను ఎదిరించి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది సహాయ సహకారాలతో 50 గులాబీ మొక్కలను నాటడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. రాఘవేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహులు, బోధనేతర సిబ్బంది సుధీర్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, 60 మంది వాలంటీర్లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.