ముద్ర ప్రతినిధి, జడ్చర్ల: చత్రపతి శివాజీ దేశానికి ఆదర్శప్రాయుడని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం శివాజీ జయంతి వేడుకలు సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని పాత బజార్ హనుమాన్ దేవాలయం సమీపంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే అనిల్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్క యువకుడు శివాజీని ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో ముందుకు సాగాలని కోరారు.