Take a fresh look at your lifestyle.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 9వ వార్డు సాయికాలనీలో దత్త సమేత సాయిబాబా ఆలయ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ పూజారి ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈకళ్యాణ వేడుక భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. సీతారాముల కల్యాణాన్ని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో 36వ వార్డు కౌన్సిలర్ లాడే మాణిలా మల్లేశం,9వ వార్డు కౌన్సిలర్ శ్రీలత శ్రీశైలం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈవేడుకల్లో ఆలయ గౌరవ అధ్యక్షులు విజేందర్ రెడ్డి,అధ్యక్షులు శంషాబాద్ శ్రీనివాస్,సెక్రటరీ బిట్ల కృష్ణమూర్తి,సహాయ కార్యదర్శి సాయన్న, కోశాధికారి మొగులయ్య,పురోహితులు ప్రశాంత్ శర్మ,మాజీ సర్పంచ్ చంద్రశేఖర్,రవిశంకర్,స్పోర్ట్స్ రవి,అశోక్ తదితర ప్రముఖులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైందని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.