ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మాతా, శిశు ఆసుపత్రిని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇన్ పేషంట్, ఔట్‌పేషంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్, రక్తపరీక్షల గది, స్కానింగ్ కేంద్రం, టీకాల గది, చిన్నారులకు పాలిచ్చే గది, మందుల గది, మరుగుదొడ్లు తదితర విభాగాలను పరిశీలించారు. పలు రిజిస్టర్లను తనిఖీ చేసి, అన్ని విభాగాల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన టీకాలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నపిల్లల వైద్య విభాగాన్ని పరిశీలించి, నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచడంత…