Take a fresh look at your lifestyle.

బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలి. -సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.

ముద్ర మోత్కూర్:

దత్తప్పగూడెం నుండి ముషీపట్ల మీదుగా మోత్కూర్ వరకు కంకర తేలి ప్రమాదకరంగా ఉన్న రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముషీపట్ల అరేగూడెం మధ్య రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దత్తప్పగూడెం నుండి ముషీపట్ల, అరేగూడెం గ్రామాల నుండి నిత్యం ప్రజలు వివిధ పనుల కోసం మోత్కూర్ మండల కేంద్రానికి వెళ్ళాలంటే రోడ్డు అద్వానంగా ఉండి పూర్తిగా కంకర తేలి ఉన్నదని ఇట్టి రోడ్డును వెంటనే అధికారులు స్పందించి నూతన బీటీ రోడ్డుగా ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ముషీపట్ల శాఖ కార్యదర్శి పాటి శ్రీనివాస రెడ్డి, భువనగిరి యాదయ్య, వెండి యాదగిరి, కొంపల్లి గంగయ్య, చింతకింది సోమరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.