Take a fresh look at your lifestyle.

ఏ ఐ ఎఫ్ బి (AIFB) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం: కొత్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండ దయానంద్ ఎన్నిక, కన్వినర్ పోస్టు రద్దు

 

ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడిన కన్వినర్ పోస్టును రద్దు చేయడం జరిగింది.

ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండ దయానంద్ ఎన్నిక.

తేదీ: 25/02/2026 రోజున అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర చైర్మన్ అధ్యక్షులు ఎం. జావేద్ లతీఫ్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగంలో లేని కన్వినర్ పోస్టును రాష్ట్ర కమిటీ అనుమతి లేకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ గారు కీ|| శే ||లు బండ సురేందర్ రెడ్డి సంతాప సభలో ప్రకటించిన కన్వినర్ పోస్టును ఏకగ్రీవంగా రద్దు చేయడం జరిగింది.

ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగం ప్రకారం నూతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పార్టీ సీనియర్ నాయకులు కొండ దయానంద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర కమిటీ కీ||శే|| లు బండ సురేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో 28/09/2024 లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో 13 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

తేదీ: 07/03/2026 రోజున 8మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. 1) రాష్ట్ర ఛైర్మెన్/అధ్యక్షులు ఎం. జావేద్ లతీఫ్, 2) రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టంగూరి బుచ్చి రెడ్డి, 3) రాష్ట్ర కార్యదర్శి కొండ దయానంద్, 4) ఆర్థిక శాఖ కార్యదర్శి కె. నరేందర్, 5) రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మూర్తి, 6) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు పరంగి రాము, 7) రాష్ట్ర కమిటీ సభ్యులు సాగి అజిత్ కుమార్ రావు, 8) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి శేఖర్ లు పాల్గొన్నారు. మెజారిటి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎనిమిది మంది ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కొండ దయానంద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడిన కన్వినర్ పోస్టును రద్దు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ రెండు తీర్మానలను ఏకగ్రీవంగా అమోదించడం జరిగింది. మిగితా (తేదీ: 28/09/2024) రోజున రాష్ట్ర మహాసభల్లో ఎన్నిక అయినా రాష్ట్ర కమిటీ యాదవిధిగా కొనసాగుతుంది.

నోట్: రాష్ట్ర కమిటీలో నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల పార్టీ ప్రధాన కార్యదర్శిలు, అధ్యక్షులు మరియు ప్రజా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు, అధ్యక్షులు రాష్ట్ర కమిటీ ఎక్స్-అఫీషియో సభ్యులు గా ఉన్నారు, ఒకరు జాతీయ కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీకి ఆహ్వానీతులుగా ఉన్నారు. విరివిగా రాష్ట్ర కమిటీలో ఏదైనా ఎన్నిక జరిగితే వీరి ఓట్లను పరిగణలోకి తీసుకోబడవు.

ఇట్లు

తెలంగాణ రాష్ట్ర కమిటీ

Leave A Reply

Your email address will not be published.