చొప్పదండి నియోజకవర్గం గోపాలరావుపల్లిలో రైతులతో మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్ రావు మాట ముచ్చట*
చెట్టు కింద రైతులతో కలిసి కూర్చొని అన్నదాతల కష్ట సుఖాలు విన్న హరీశ్ రావు
ఈ సందర్భంగా రైతులు వారి కష్టాలను, ఆవేదనను హరీశ్ రావుకు చెప్పుకున్నారు.
ప్రభుత్వం సకాలంలో చెరువులు, కుంటలు నింపకపోవడం వల్ల పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు కన్నీరు మున్నీరు అయ్యారు.
కాల్వల్లో పూడిక తీయకపోవడం వల్ల నీటి సరఫరా కావడం లేదన్నారు.
భూగర్భ జలాలు తగ్గిపోవడం, సాగు నీటి సరఫరా లేకపోవడం వల్ల అప్పులు చేసి బావుల్లో పూడిక తీసినట్లు రైతులు చెప్పారు.
యూరియా సరఫరా లేదు, ఓటీపీ చెప్పాలి అంటే మాకు తెల్వడం లేదు. యాప్స్ లో యూరియా మేము ఎలా తీసుకోవాలన్న రైతులు. యూరియా కోసం చెప్పులు లైన్లలో పెడుతున్నాం. కేసీఆర్ ఉన్నపుడు ఫోన్ చేస్తే ఆటోలల్ల వచ్చేది.
కేసీఆర్ గారు ఉండగా సకాలంలో రైతు బంధు పడేది, ఇప్పుడు కోతల కాలం వచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ వచ్చినంక మా బతుకులు ఆగం అయినయి. నీళ్ల కోసం, యూరియా కోసం అనేక తిప్పలు పడుతున్నం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12వేలు ఇస్తం అన్నరు, మహాలక్ష్మి కింద 2500 ఇస్తం అన్నరు మోసం చేసిండని ఆవేదన వ్యక్తం చేసిన మహిళా కూలీలు
నేను రైతు భరోసా వేసిన పడ్డదో లేదో అని ముఖ్యమంత్రి అంటే మేమేం కావాలన్నరు.
కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నరు.
నీళ్లకు ఇబ్బంది అవుతున్నది, యూరియాకు ఇబ్బంది, కరెంటు లేక ఇబ్బంది అవుతున్నదన్నరు.
రెండు లక్షల 65వేల అప్పు ఉండే, రెండు లక్షల వరకు మాఫీ చేస్తా అన్నసీఎం మాటలు విని భార్య పేరు మీద మహిళా సంఘంల అప్పు తెచ్చి మీద పైసలు కడితే, రెండు లక్షల మాఫీ కాలేదు, మీద అప్పు మిగిలిందని అని రామారావు అనే రైతు ఆవేదన చెప్పుకున్నడు.
5ఎకరాలు ఉన్నయి, నీళ్ల సరఫరా లేదు, ఊట లేదు, నీళ్లు లేక బాయి పూడిక తీస్తున్న. అప్పులు తెచ్చి పనులు చేస్తున్నం అని ఆవేదన వ్యక్తం చేసిన లచ్చన్న అనే మరో రైతు.
కేసీఆర్ ఉన్నపుడు కుంటలు, బావులు, చెరువుల్ల ఫుల్లు నీళ్లు ఉండే, బిఆర్ఎస్ పార్టీ పోయింది, మా బతుకు ఎండిపోయింది అని ఉప్పు లచ్చయ్య అనే మరో రైతు ఆవేదన వ్యక్తం చేసిండు.
నాలుగు రైతు బంధులకు మాకు ఒక్కటే పడిందని, ఈ పంటకు ఇప్పటికీ దిక్కు లేదని బాధ పడ్డ రైతులు
కేసీఆర్ ఉన్నపుడు అన్ని మంచిగుండే ఇప్పుడు అన్నింటికి సర్వ దు:ఖం
ఆధార్ కార్డు, పాస్ బుక్కు, దానికి ఓటిపి, మేం సదువు రానోళ్లం, ఫోన్లు లేనోల్లం ఎట్ల యూరియా తెచ్చుకోవాలె.
ఓటీపీ చెప్పే లోపు టైం అయిపోతంది, మిమ్మల్ని పక్కకు నూకేస్తున్నరు అని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
కాంగ్రెస్ వచ్చింది ప్రతి ఒక్క దానికి ఇబ్బందే ఉంది.
వేలకు వేలు పెట్టినా బోర్లు పడటం లేదు,
పైపులు కొనుడు, క్రేన్లు పెట్టుడు మాతోని కావడం లేదు అన్న రైతులు
తమ గ్రామంలో 70 మందికి రుణమాఫీ కాలేదని వినతి ఇచ్చిన గోపాలరావు పల్లి రైతులు
బడ్జెట్ సమావేశంలో ఊరు సమస్యలపై మాట్లాడాలని కోరిన రైతులు
రైతు బంధు ఎగ్గొట్టారని, 70 మంది రైతులకు రుణమాఫీ కాలేదని అసెంబ్లీలో తమ సమస్యలు ప్రస్తావించాలని రైతులు కోరారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు గారి కామెంట్స్….
రైతుల బాధలు వింటుంటే కడుపు తరుక్కు పోతున్నది.
బిఆర్ఎస్ పాలనలో రైతులు ఎట్లుండే, ఇప్పుడు ఎలా అయ్యారు.
కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నరు రైతులు
లెక్కలేనన్ని బాధలు చెబుతూ, లెక్కలేనంత శోఖం భరిస్తున్నరు.
బావుల్లో నీళ్లు లేక పూడిక కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు.
పంట పెట్టుబడి కోసం చేసిన పైసలు కూడా రావడం లేదని చెప్పారు.
రైతుల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రస్తావిస్తుంది
చొప్పదండి మండలం గోపాలరావు గ్రామ రైతాంగానికి తక్షణం నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
పంటల దిగుబడి పెరగడానికి బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం.
ఎస్ ఆర్ ఎస్ పునరుజ్జీవం, మల్కంపేట రిజర్వాయర్, గౌరవెల్లి ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేసింది బిఆర్ఎస్
మేం అన్ని చేసినం కాబట్టి కరీంనగర్ లో ఇంత పంట పండుతున్నది.
నువ్వు ఏం చేసినవో చెప్పు రేవంత్ రెడ్డి.
చెక్ డ్యాం కట్టారా, ప్రాజెక్టు కట్టారా, కాల్వ తవ్వారా?
రైతు బంధు ఎగ్గొట్టారు, బోనస్ ఎగ్గొట్టారు, అన్ని చెడగొట్టారు.
ఎందుకు పంటలు ఎండుతున్నాయి. ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నవు
మేడిగడ్డను ఎందుకు మరమ్మతులు చేయడం లేదు.
ఎల్లంపల్లి బంద్ పెట్టి, నారాయణ్ పేట మోటార్లు బంద్ పెట్టినవు
నీ మూర్ఖత్వం, కక్ష, పగ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నరు.
మా మీద కోపం ఉంటే జైళ్లలో పెట్టు, కాని రైతుల ఉసురుకు ఎందుకు తీసుకుంటున్నవు.