ముద్ర. పరకాల.
తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార్ వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం 8వ వార్డులో తన మద్దతు దారులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఎనిమిదవ వార్డు నుండి గెలిచిన అభ్యర్థులు ఇప్పటివరకు వార్డు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి పదవి చేపట్టకుండానే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం సొంత నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు గ్రామంలో ఉన్న వివిధ దేవాలయాల పునరుద్ధరణకు, మట్టి రోడ్ల నిర్మాణం చేసి ప్రజలకు కూలీలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఎలాంటి పదవులు లేనప్పుడు గ్రామ ప్రజల కష్టాలను గుర్తించి పరిష్కారానికి చొరవ తీసుకున్న తాను ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెడతానని అన్నారు. తనను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానన్నారు. గతంలో గెలిచిన వాళ్లు సీతారాంపురం గ్రామంలో ఉండబడిన రోడ్లు ఇతర మౌలిక సమస్యలు ఇప్పటికీ ఉండేది కాదన్నారు. అలాంటి వాళ్లకు తిరిగి అవకాశం ఇస్తే ఎనిమిదవ వార్డు ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ఆయన ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.