Take a fresh look at your lifestyle.

​గోస్పెల్ గ్లోబల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు

ముద్ర కూకట్‌పల్లి :

గోస్పెల్ గ్లోబల్ మినిస్ట్రీస్ 36వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సహకారంతో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షల సమావేశం గురువారం ఘనంగా నిర్వహించబడింది. బిషప్ ఆర్.ఎ. పాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత, శాంతి మరియు సోదరభావాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఆధ్యాత్మిక సమావేశాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాలి బాలాజీ, పుష్ప రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, గంధం రాజు, దినేష్ కుమార్, శివ చౌదరి, సుజాత, వాణి, శైలజ, శ్రీకాంత్ పటేల్, పులి శివ గౌడ్, నాయుడు, మదన్ మోహన్, ప్రశాంత్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.