Take a fresh look at your lifestyle.

చిన్న చెరువు సుందరీకరణకు నిధులు కేటాయించండి

 

ముద్ర కాప్రా

చిన్నచెరువు సుదరీకరణ పనులకు అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని హైడ్రా కమీషనర్ రంగనాధ్ ను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి శనివారం వినతి పత్రం అందజేశారు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూచెరువుల సుందరీకరణ చేయాలనీ, ప్రజలను ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే నిర్ణయంతో, చెరువులను అభివృద్ధి పరచాలన్నారు,
చెరువుల వద్ద ప్రజలు సాయంకాలంతో పాటు సెలవురోజులలో వచ్చి గడిపేందుకు అవసరమైన వసతులు కల్పించాలని,
చెరువులవద్ద కట్ట విస్తరణ ,గ్రీనరీ లైటింగ్ ,బెంచిలు ,పూల మొక్కలు ఏర్పాటు చేసి అంత పచ్చగా ఉండేలా సుదరీకరణ చేపట్టాలన్నారురామంతాపూర్ డివిజన్ ఇంద్రానగర్ చిన్నచెరువు సుదరీకరణ పనులు శాంక్షన్ కోసం ఎమ్మెల్యే హైడ్రా కమీషనర్ ని కలిసి పనులు ప్రారంభించాలని కోరారు,హైడ్రా కమీషనర్ రంగనాథ్ సానుకూలనుగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పనులను ప్రారంభిస్తామని తెలిపారు
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావుతదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.