Take a fresh look at your lifestyle.

మామిడి సీజన్ లో ఇబ్బందులు లేకుండా చూస్తాం

  • గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి

ముద్ర,ఇబ్రహీంపట్నం: మామిడి సీజన్ లో వర్తకులు,చిరు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు.బాటసింగారం పండ్ల మార్కెట్ లో మామిడి దిగుమతుల నేపథ్యంలో సోమవారం మామిడి వ్యాపారస్తులు,సంబంధిత శాఖల అధికారులు,మార్కెట్ సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మామిడి వ్యాపారులు సీజన్ లో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద మామిడి దిగుమతులు,ఎగుమతులు బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్నాయని అన్నారు.ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని అన్నారు.కనీస వసతులు కలిపిస్తామని,రైతులకు విశ్రాంతి,వైద్య సేవలు,ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ వంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సీఐ అంజిరెడ్డి,ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు,ఫైర్ స్టేషన్ సీఐ యాదగిరి,మార్కెట్ వైస్ చైర్మన్ బాస్కర చారి,మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్,పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.