Take a fresh look at your lifestyle.

తల్లిని చంపిన  కన్నకూతురు

  • జీడిమెట్ల పరిధిలో హత్య.
  • మైనర్లు మర్డర్ చేశారు..జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.
  • కన్న తల్లి అని చూడకుండా కుమార్తె దారుణానికి ఒడిగట్టింది.        

  కుత్బుల్లాపూర్ ముద్ర విలేకరి : ఎన్ ఎల్ బి నగర్ లో నివాసముండే సట్ల  అంజలి(39)నీ కూతురు తేజశ్రీ తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి,తలపై కొట్టి హత్య చేసింది.పగిల్ల శివ(19),అతని తమ్ముడు పగిల్లా యశ్వంత్(18) తో కలిసి  కన్న కూతురు హత్య చేసింది.తన ప్రియుడు అతని సోదరుడితో కలిసి హత్య చేసింది. అయితే ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురూ మైనర్లే కావడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వివరాల్లోకి వెళితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్  పరిధిలోఈ దారుణం జరిగింది. కసాయి కూతురు కన్న తల్లి అని చూడకుండా ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్‌లో నివాసముండే సట్ల అంజలీని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి, సుత్తితో  తలపై కొట్టి కుమార్తె తేజశ్రీ ( 16 )  హత్య చేసింది. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి తల్లి మందలించిందనే కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. తేజశ్రీ తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్లా యశ్వంత్(18)తో కలిసి హత్యకు పాల్పడింది. కాగా తేజశ్రీ (16) పదవ తరగతి చదువుతోంది. 8 నెలల క్రితం ఇంస్ట్రోగ్రామ్ లో పరిచయమైన లవర్ బాయ్ తో  హత్య చేయించింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ హత్యకు పాల్పడిన అందరూ మైనర్లే కావడం గమనార్హం. ఈనెల 19న ఇంట్లో నుంచి మైనర్ బాలిక తేజశ్రీ ప్రియుడుతో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిపోయింది దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి అంజలి అల్లాడిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనంతరం ప్రియుడు శివ మైనర్ బాలికను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు.దీంతో పోలీసులు శివకు నోటీసులు ఇచ్చి పంపించారు.ఈ క్రమంలో తమను విడదీస్తున్నతల్లిని చంపేయాలని కుమార్తె తేజశ్రీ నిర్ణయించుకుంది.ప్రియుడు శివ, అతని సోదరుడి సహాయంతో చున్నీతో మెడను బిగించి హతమార్చాలని వారు ప్రయత్నించారు. అయితే అప్పటికి ఆమెకు ప్రాణం పోకపోవడంతో సుత్తి తలపై పలుమార్లు బలంగా మోదీ చంపినట్లు నిందితులు ఒప్పుకొంటున్నారు.తల్లిని హత్య చేసింది.తన ప్రేమకు తల్లి అడ్డొస్తోందనే కోపంతో తల్లిని హత్య చేసింది. సంఘాటనా స్థలన్ని డి సి పి సురేష్ కుమార్ సందర్శించారు.

  • అంజలి మరణం తెలంగాణ కళాకారులకు తీరాని లోటు.
  • ప్రజాకళాకారుడు దరువు అంజన్న.

తెలంగాణా ఉద్యమంలో అంజలి కీలక పాత్ర పోషించిందని అలాంటి కళాకారిణి హత్యకు గురికావడం విచారకరమని ప్రజకాకారుడు దరువు అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు.స్వాతంత్ర పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మానువరాలుగా ఎప్పుడు పలు సందర్బలలో చెప్పుకునేధని తెలంగాణ ఉద్యమం సమయలో చాలా చురుకైనా పాత్ర పొంచించడం జరిగిందన్నారు. అందుకే తెలంగాణా సంస్కృతిక సారధి సంస్థలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందమన్నారు.

Leave A Reply

Your email address will not be published.