Take a fresh look at your lifestyle.

టిడిపికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలి- సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పాశి కంటి సత్యం..

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:

టిడిపి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సిద్దిపేట నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జి పాశికంటి సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కాంచిట్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీ ఏ దశలో ఉందో తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్వ వైభవం తేవడానికి కార్యకర్తలు పని చేసే సమయం ఆసన్నమైంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసే టిడిపి పార్టీని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, ఎండి గౌస్ మియా, మల్లేశం సతీష్ గౌడ్ యాదగిరి సత్యనారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.