Take a fresh look at your lifestyle.

ఐజేయూ జాతీయ మహాసభలో మెదక్ ప్రతినిధి

ముద్ర ప్రతినిధి మెదక్:
ఆంధ్రప్రదేశ్ విజయవాడ అమరావతిలో జరిగిన ఐజేయూ 11వ జాతీయ మహాసభలకు మెదక్ జిల్లా ప్రతినిధిగా కమ్మరి శ్రీనివాస్(మిన్పూర్) హాజరయ్యారు. ఈ సభలో ఐజేయూ నూతన జాతీయ అధ్యక్షుడిగా బల్వీందర్ సింగ్ జమ్మూ, ప్రధాన కార్యదర్శిగా డి. సోమసుందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ తదితరులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.