ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అఖండ ప్రేమ జ్యోతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.స్వామి వారి దివ్య సన్నిధి ప్రశాంతి నిలయం పుట్టపర్తి నుండి బయలుదేరిన దివ్య అఖండ ప్రేమ జ్యోతి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రమంతటా పర్యటించి సంగారెడ్డిజిల్లాలో ప్రవేశించింది.పటాన్చెరు నుండి ఆదివారం ఉదయం ఉదయము 09.30 గం.కు జోగిపేట మధ్యరంగం నుండి పూర్ణకుంభం,వేద పఠణముతో మందిరానికి చేరుకోవడం జరిగింది.అనంతరం నూతన జ్యోతి ప్రకాశ అనంతరం మంగళ హారతి దివ్య దర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.