Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదాలను నివారించాలి- అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్ :
రోడ్డు ప్రమాదాలను నివారించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు .
గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రోడ్డు రవాణా అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజల్లో రోడ్డు రవాణాపై అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, బైక్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపాలన్నారు.
ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.