సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి 26
జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం ద్వితీయ సంవత్సరం తెలుగు, హిందీ, ఉర్దూ,సంస్కృత భాషా పేపర్ల పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు.
మొత్తం 15,515 మంది విద్యార్థులకు గాను 15,209 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో జనరల్ కోర్సుకు చెందిన 14,296 మంది, వృత్తి (వొకేషనల్) కోర్సుకు చెందిన 913 మంది విద్యార్థులు హాజరైనారని తెలిపారు.
మొత్తం 306 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందులో జనరల్ కోర్సుకు చెందిన 259 మంది, వృత్తి కోర్సుకు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.మొత్తం హాజరు శాతం 98.03% నమోదైందనీ,
ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.
పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు కన్వీనర్/డీఐఈఓ 2 పరీక్ష కేంద్రాలను, డీఈసీ సభ్యులు 11 కేంద్రాలను, హెచ్‌పీసీ సభ్యులు 5 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్లు 14 కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 8 కేంద్రాలను తనిఖీ చేసినట్లు గోవింద్ రామ్ పేర్కొన్నారు.